ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మెరుపు దాడులు.. కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు

  • మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఈడీ
  • చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాజ్ కెసిరెడ్డి తదితరుల నివాసాల్లో సోదాలు
  • లిక్కర్ స్కామ్ లో వీరంతా కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే గుర్తించిన సిట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో నేడు మరో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఈడీ అధికారులు... కేసులోని ఐదుగురు కీలక వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.


సోదాలు ఎవరి నివాసాల పైన?  

  • చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే

  • కృష్ణమోహన్ రెడ్డి: మాజీ సీఎం జగన్ ఓఎస్డీ (OSD)

  • ధనుంజయరెడ్డి: విశ్రాంత ఐఏఎస్ అధికారి

  • బాలాజీ గోవిందప్ప: భారతీ సిమెంట్స్ డైరెక్టర్

  • రాజ్ కెసిరెడ్డి: లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు.


గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వీరంతా కీలక పాత్ర పోషించారని సిట్ ఇప్పటికే నిర్ధారించింది. అక్రమంగా సంపాదించిన ఆస్తులు, నగదు మళ్లింపునకు సంబంధించిన పక్కా ఆధారాల కోసమే ఈడీ ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.


AP liquor scam
enforcemence directorate

More Telugu News